సుధీర్ బాబుకు విలన్‌గా నాని!

Hero

oi-Dornadula Tirumala

డబుల్ హ్యాట్రిక్ చిత్రాల హిట్స్‌తో జోరుమీదున్న నానికి గత ఏడాది దేవదాస్, కృష్ణార్జున యుద్ధం చిత్రాలు బ్రేక్ వేశాయి. ఈ ఏడాది నాని వైవిధ్యం ఉన్నా కథలపై ద్రుష్టి పెట్టాడు. గౌతమ్ తిన్ననూరి దర్శత్వంలో తెరకెక్కుతున్న జెర్సీ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. మరోవైపు మైత్రి మూవీస్ నిర్మాణంలో, విక్రమ్ కుమార్ దర్శత్వంలో గ్యాంగ్ లీడర్ చిత్రం ప్రారంభమైపోయింది. ఇదిలా ఉండగా తనని హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శత్వంలో నాని మూడవ చిత్రానికి రెడీ అవుతున్నాడు.

ఇంద్రగంటి మోహన్ కృష్ణ నానికి నెగిటివ్ షేడ్స్ లో అద్భుతమైన పాత్ర సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నాని విలన్ గా నటిస్తాడట. మరో హీరో సుధీర్ బాబు పోలీస్ అధికారిగా నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. విలన్ పాత్ర అయినప్పటికీ కథ వైవిధ్యంగా ఉండడంతో నటించేందుకు నాని అంగీకరించినట్లు తెలుస్తోంది.

Sudheer Babu and Nani join hands together for Mohan Krishna Indraganti movie

అదితి రావు హైదరి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించబోతోంది. నాని క్రికెటర్ గా నటిస్తున్న జెర్సీ చిత్ర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు విక్రమ్ కుమార్ దర్శకత్వంలోని గ్యాంగ్ లీడర్ షూటింగ్ జరుగుతోంది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ కూడా షూటింగ్ ప్రారంభిస్తే ఈ ఏడాది నాని నుంచి మూడు చిత్రాలు ఆశించవచ్చు.