సికింద్రాబాద్ నుంచి బరోనికి ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్ : ప్రయాణీకుల రద్దీనీ దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్ నుంచి బీహర్‌లోని బరోనికి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. సికింద్రాబాద్ నుంచి మార్చి 18న సోమవారం రాత్రి 7.50 గంటలకు బయలుదేరి బుధవారం మధ్యాహ్నం చేరుకుంటుంది. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో మార్చి 22న 11.45 గంటలకు బోరోని నుంచి బయలుదేరి సికింద్రాబాద్‌కు మరుసటి రోజు రాత్రి 11.55 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు కాజీపేట,రామగుండం, మంచిర్యాల్. బల్హర్ష, నాగ్‌పూర్,ఇటార్సీ, పిపారియా,జబల్‌పూర్,కాట్ని, సాట్నా,మాణిక్‌పూర్, అలహాబాద్ చీకి, దీన్‌దయాల్ ఉపాధ్యాయ్ జంక్షన్, బక్సర్, అరా, దనాపూర్,పాట్నా, భక్తియార్పూర్, మొకమా స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుంది.