సంచలనం రేపుతోన్న అనంతపురం రాజకీయాలు .. బాబుకు చుక్కలు చూపిస్తున్న జేసి ..!

అనంత పురం పరిధిలోని నియోజక వర్గాల అభ్యర్థుల విషయంలో ఇంకా లొల్లి కొనసాగుతూనే ఉంది. జేసి ఖచ్చితంగా కొన్ని నియోజక వర్గాల అభ్యర్థులను మార్చాల్సిందేనని లేక పోతే మేము ఓడిపోవటానికి సిద్ధంగా లేమని మాట్లాడుతున్నాడు.  దీనిపై శుక్రవారం అమరావతిలోని కమిటీని కలిసిన ఆయన పలువురు అభ్యర్థిత్వాలపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇదే అంశాన్ని మీడియా ముందు ఆయన పరోక్షంగా వెల్లడించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద మీడియాతో మాట్లాడుతూ… అనంతపురం నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీని గెలిపించాలన్నదే నా లక్ష్యమన్నారు. మా కుటుంబంలో ఎవరు పోటీలో ఉన్నా గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని ఉద్ఘాటించారు.

అంతేకాదు కొందరి గెలుపుపై తమకు అనుమానాలున్నాయి. వారి అభ్యర్థిత్వాల విషయంలో పునరాలోచించాలని స్క్రీనింగ్‌ కమిటీకి స్పష్టంగా చెప్పానని జేసీ పేర్కొన్నారు. వారిని మారిస్తేనే ఎంపీగా గెలుస్తామని, మేము ఓడిపోడానికి సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. అంతేకాదు పార్టీ మారే ప్రసక్తేలేదని, అభ్యర్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన తర్వాత పోటీలో ఉండాలా? లేదా? అన్నది నిర్ణయించుకుంటామని కుండబద్దలుకొట్టారు. కొద్ది రోజులుగా మూడు, నాలుగు స్థానాల అభ్యర్థుల విషయంలో జేసీ దివాకర్‌రెడ్డి తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

ముఖ్యంగా శింగమనల, కల్యాణదుర్గం, గుంతకల్లు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులపై ఆయన పట్టుబడుతున్నారు. వీరితోపాటు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో వైరం కారణంగా ఆయన కూడా గెలిచే అవకాశం లేదంటూ చంద్రబాబుకు తెలిపినట్టు తెలుస్తోంది. ఈ కారణాలతోనే అనంతపురం పార్లమెంటు పరిధిలోని స్థానాలను పెండింగ్‌లో పెట్టినట్టు సమాచారం.  జేసీకి తలొగ్గి ఎలాంటి మార్పులు చేయవద్దని చంద్రబాబుకు కీలక నేతలు సూచించినట్టు భోగట్టా. 

5/
5 –
(1 votes)
Add To Favourite