పారికర్‌ను సాగనంపండి

-ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించండి-గోవా గవర్నర్ మృదులాసిన్హాకు సీఎల్పీ నేత లేఖ-రాష్ట్రపతి పాలన విధిస్తే చట్టవిరుద్ధం.. సవాల్ చేస్తామని స్పష్టీకరణ

న్యూఢిల్లీ/ పనాజీ, మార్చి 16: గోవాలో తిరిగి రాజకీయ అనిశ్చితి నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యే, మాజీ సీఎం ఫ్రాన్సిస్ డిసౌజా మరణం తర్వాత బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో పడిందని, తమను ప్రభు త్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ మృదులా సిన్హాను కాం గ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, సీఎల్పీ నేత చంద్రకాంత్ కావ్లేకర్ శనివారం గవర్నర్ మృదులా సిన్హాకు లేఖ రాశారు. అసెంబ్లీలో తమదే అతిపెద్ద పార్టీ అని అన్నారు. గోవా లో రాష్ట్రపతి పాలన విధిస్తే రా జ్యాంగ విరుద్ధం అ వుతుందని, దీన్ని స వాల్ చేస్తామన్నారు. గవర్నర్‌కు కాంగ్రెస్ పార్టీ లేఖ రాసిన కొన్ని గంటల వ్యవధిలోనే బీజేపీ తన ఎమ్మెల్యేలతో అత్యవసర శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే అంతకుముందు సీఎం పారికర్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని సీఎం కార్యాలయం (సీఎంవో) ఒక ప్రకటన చేసిం ది. ఇదిలా ఉంటే గోవాలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో సీఎం పారికర్ పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు. ఆయన మార్గదర్శకత్వంలోనే పని చేస్తామని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.