నానీ ఏంటి.. నెగెటివ్ రోల్..

తనని వెండి తెరకు పరిచయం చేసిన దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ మరోసారి అవకాశమిస్తానంటే ఎలా కాదనగలడు. అందుకే ఓకే చేసేశాడు. ప్రస్తుతం జెర్సీ చిత్రంతో బిజీగా ఉన్న ఈ నేచురల్ స్టార్ అది పూర్తవకుండానే మరో చిత్రానికి సైన్ చేశాడు. విక్రమ్ దర్శకత్వంలో వస్తున్న గ్యాంగ్ లీడర్ చిత్రంలో కూడా నానీనే హీరో. ఇక ఇంద్రగంటి చిత్రం మల్టీ స్టారర్‌గా తెరకెక్కనుంది.

ఇందులో సుధీర్ బాబు పోలీస్ అధికారి పాత్రలో నటించనుండగా, నాని ప్రతి నాయక పాత్ర పోషిస్తున్నాడు. ఇది పూర్తి స్థాయి నెగటివ్ కారెక్టర్ అయినా పాత్రకున్న బలం తనని ఒప్పించిందని నానీ అంటున్నాడు. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. సంగీత దర్శకులైతే ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి వారిలో అమిత్ త్రివేది లేదా మణిశర్మ ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.