తొలి ప్రచారసభను ప్రారంభించిన వైయస్ జగన్

YS Jagan launched the first public meeting

సార్వత్రిక ఎన్నికలకు ప్రచారాన్ని ప్రాంభించారు వైసీపీ అధినేత జగన్‌. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నుంచి తొలి ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన అధికారంలోకి రాగానే అవినీతి లేని పాలన అందిస్తామని అన్నారు. తన పాదయాత్రలో 13 జిల్లాల ప్రజల కష్టాలను విన్నాను.. కళ్లారా చూశానని అన్నారు. మట్టి నుంచి ఇసుక వరకు దేన్ని వదలకుండా దోచుకుంటున్నారని ఆరోపించారు. ఏపరిశ్రలోనైనా స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా అసెంబ్లీలో చట్టం తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రభుత్వ స్కూళ్ల పూర్తిగా మార్చేమని అన్నారు జగన్‌. వ్యవసాయాన్ని మళ్లీ పండుగ చేస్తామని హామీ ఇచ్చారు . ప్రతి ఎకరాకు నీరు అందించేలా ప్రాజెక్టులను పూర్తిచేస్తామని చెప్పారు. చంద్రబాబు ఇచ్చే 3వేల రూపాయలను మోసపోవద్దనన్నారు. రైతులకు పెట్టుబడి సాయం కింద 12వేల 500 అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి నిరుపేద కుటుంబాన్ని లక్షాదికారిని చేస్తామని అన్నారు. పట్టలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను అన్ని విధాలుగా అదుకుంటామని చెప్పారు.

వైఎస్‌ఆర్ చేయూత కింద మహిళలకు 75వేలు అందిస్తామని హామీ ఇచ్చారు . అధికారంలోకి రాగానే 3వేల పెన్షన్‌ అందిస్తామని పేర్కొన్నారు.