విమానాశ్రయంలో మోడీ.. 4 గంటల నిరీక్షణ..!

National

oi-Vasam

By

|

డెహ్రడూన్‌ : బిజీ షెడ్యూల్ కారణంగా తీరిక లేకుండా ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ.. దాదాపు 4 గంటలు నిరీక్షించాల్సి వచ్చింది. దాంతో గురువారం నాడు ఉత్తరాఖండ్‌ పర్యటనకు వచ్చిన మోడీకి ఇబ్బంది తప్పలేదు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి వచ్చిన మోడీ నాలుగు గంటల పాటు విమానాశ్రయంలోనే వేచి ఉండాల్సి వచ్చింది.

డెహ్రడూన్‌లోని జోలీ గ్రాన్‌ విమానాశ్రయానికి చేరుకున్న మోడీకి.. వాతావరణం కారణంగా నిరీక్షణ తప్పలేదు. భారీ వర్షం కురియడంతో ఆయన వెయిట్ చేయాల్సిన పరిస్థితి. దాదాపు 4 గంటల పాటు ఎయిర్‌పోర్టులోనే వేచి ఉన్న మోడీ.. వర్షం తగ్గిన తర్వాత బయటకు రావాల్సి వచ్చింది.

modi waiting for four hours in dehradun airport

ఉద్ధమ్ సింగ్ నగర్ జిల్లాలో 3 వేల 400 కోట్ల రూపాయలతో తలపెట్టిన తొలి ఇంటిగ్రేటెడ్ కోఆపరేటివ్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించడానికి ఉత్తరాఖండ్‌ పర్యటనకు వచ్చారు మోడీ. అయితే వాతావరణంలో మార్పుల కారణంగా గురువారం వర్షాలు పడే ఛాన్సుందని వాతావరణ శాఖ ముందే అలర్ట్ చేసింది. అయితే గతంలోనే షెడ్యూల్ ఫిక్స్ కావడంతో మోడీ రాక తప్పలేదు. అయితే వర్షం కారణంగా విమానాశ్రయంలోని స్పెషల్ రూమ్ లో మోడీ వెయిట్ చేసినట్లు సమాచారం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు – రిజిస్ట్రేషన్ ఉచితం!