మార్స్‌పై ఆపర్చునిటీ రోవర్ చనిపోయినట్లు ప్రకటించిన నాసా… 2020లో మరో రోవర్ ప్రయోగం

మార్స్‌పై ఆపర్చునిటీ రోవర్ చనిపోయినట్లు ప్రకటించిన నాసా... 2020లో మరో రోవర్ ప్రయోగం

ఆపర్చునిటీ రోవర్ (Image : NASA)


Krishna Kumar N | news18-telugu

Updated: February 14, 2019, 6:45 AM IST

2003 అంగారక గ్రహంపైకి నాసా ప్రయోగించిన ఆపర్చునిటీ రోవర్… 2018లో భారీ ఇసుక తుఫానులో చిక్కుకుంది. 8 నెలలుగా ఎలాంటి కదలికా లేకుండా సైలెంట్‌గా ఉండిపోయింది. గత ఎండాకాలం అంతా రోవర్ చుట్టూ ఇసుక, దుమ్ము వాతావరణం నిండిపోయింది. ఆ స్పేస్ క్రాఫ్ట్ సోలార్ ప్యానెళ్లపై దుమ్ము పేరుకుపోయి… సూర్య కిరణాలు పడే అవకాశం లేకుండాపోయింది. ఫలితంగా అది ఎలాంటి సిగ్నల్స్‌కీ స్పందించకుండా రాయిలా మారిపోయింది. దాన్ని కదపడానికి ఇప్పటికే 1000 సార్లు రేడియో సిగ్నల్ కమాండ్స్ పంపింది నాసా. అయినా ఫలితం లేకపోయింది. చివరిసారిగా మరోసారి ఆపరేషన్ చెసింది. అప్పటికీ కదలకపోవడంతో… ఇక ఈ రోవర్ చనిపోయినట్లుగా (Dead) నాసా ప్రకటించింది. మరో కొత్త రోవర్‌ను 2020లో మార్స్‌పైకి పంపాలని నిర్ణయించింది.

mars, nasa, opportunity rover, curiocity, spirit, insight, mars nasa, మార్స్, అంగారక గ్రహం, అరుణ గ్రహం, ఆపర్చునిటీ రోవర్, క్యూరియోసిటీ రోవర్

మార్స్ ఊహాచిత్రం (Image : NASA)

ఆపర్చునిటీ విశేషాలు :* ఆపర్చునిటీ చేసిన సేవల్ని ఈ ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు. ఎందుకంటే మార్స్‌పై నీటి ప్రవాహాలు ఉన్నట్లు తేల్చింది ఈ స్పేస్ క్రాఫ్టే.

* ఇప్పటివరకూ ఎక్కువ కాలం మార్స్‌ పైనుంచీ సేవలు అందించిన రోవర్ ఇదే.
* 6 చక్రాలతో ఇది అంగారక గ్రహంపై 45 కిలోమీటర్లు వెళ్లడం కూడా ఓ రికార్డే.

Loading….

* ఆపర్చునిటీలాగే ఉండే స్పిరిట్ రోవర్ కూడా చనిపోయినట్లు 2011లో నాసా ప్రకటించింది. అది 2010లో ఇసుకలో కూరుకుపోయింది. ఐతే రెండు రోవర్లూ అంచనాలకు మించి సేవలు అందించాయి.
* ఆపర్చునిటీకి గుడ్ బై చెప్పడానికి నాసా శాస్త్రవేత్తలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. దాన్ని ఓ రోవర్‌లా కాకుండా, ఓ మనిషిలా భావించామని ఉద్వేగానికి లోనవుతున్నారు.

mars, nasa, opportunity rover, curiocity, spirit, insight, mars nasa, మార్స్, అంగారక గ్రహం, అరుణ గ్రహం, ఆపర్చునిటీ రోవర్, క్యూరియోసిటీ రోవర్

నాసా క్యూరియోసిటీ రోవర్ ( Courtesy NASA/JPL-Caltech/MSSS/Handout via REUTERS)

ప్రస్తుతం క్యూరియోసిటీ రోవర్ మార్స్‌పై పరిశోధనలు చేస్తోంది. అలాగే ఇటీవల నాసా… ఇన్‌సైట్ ల్యాండర్‌ను కూడా పంపింది. అది మార్స్ లోపలి పొరల్లో ఖనిజాలపై అన్వేషిస్తోంది.

Video : ఢిల్లీలో అగ్నిప్రమాదం… కాలి బూడిదైన 250 గుడిసెలుFirst published: February 14, 2019