ఇండస్ట్రీ లో వర్మ ఎవరిని వదిలి పెట్టటం లేదు … ఇప్పుడు మోహన్ బాబు …!

రామ్ గోపాల్ వర్మ ఎవరితోనైనా కయ్యం పెట్టుకోగల డైరెక్టర్. ఇప్పుడు లేటెస్ట్ గా తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా లో చాలా మంది ని నెగటివ్ గా చూపించే పని లో ఉన్నాడు. ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ ని యాంటీ గా చూపించ బోతున్నాడని తెలుస్తుంది. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మోహన్ బాబు కూడా వచ్చి చేరాడు . ఇప్పటికే ఈ సినిమా కు కావాల్సినంత బజ్ వచ్చింది. అయితే ఇక మరికొన్ని ఆసక్తికరమైన అప్ డేట్స్ లక్ష్మిస్ ఎన్టీఆర్ గురించి హైప్ పెంచేలా ఉన్నాయి.

ram-gopal-varma-mohan-babu-lakshmis-ntr

వాటిలో ఒకటి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మీద సెటైర్లు ఉంటాయనే టాక్. ఎన్టీఆర్ తన చరమాంకంలో అత్యంత సన్నిహితంగా ఉన్నది లక్ష్మి పార్వతి తర్వాత మోహన్ బాబుతోనే. అందుకే తన చివరి కమర్షియల్ చిత్రం మేజర్ చంద్రకాంత్ అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా లక్ష్మి ప్రసన్న బ్యానర్ లో చేసారు. అది బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ విశేషాన్ని మోహన్ బాబు చాలా సార్లు పంచుకున్నారు. కానీ ఎన్టీఆర్ చనిపోయాక సీన్ మారింది.

ram-gopal-varma-mohan-babu-lakshmis-ntr

లక్ష్మీ పార్వతి మోహన్ బాబుల మధ్య వదిన మరిది బంధం బెడిసి కొట్టింది. ఓ సందర్భంలో ఆవిడ మోహన్ బాబు మోసగాడు అని ఇంటర్వ్యూలో అనేశారు కూడా. ఇప్పుడు వర్మ ఈ ప్రస్తావన తన సినిమాలో తెస్తున్నట్టు వినికిడి. వర్మకు మంచు ఫ్యామిలితో మంచి బాండింగ్ ఉంది. మోహన్ బాబుతో రౌడి-విష్ణుతో అనుక్షణం-మనోజ్ తో ఎటాక్ తన డైరెక్షన్ లోనే తీసాడు. ఈ ముగ్గురూ వర్మను పలు సందర్భాల్లో పొగిడారు కూడా. అలాంటిది ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ లో కౌంటర్లు వేసేలా మోహన్ బాబుని చూపిస్తాడా అంటే అనుమానమే. 

ram-gopal-varma-mohan-babu-lakshmis-ntr
5/
5 –
(1 votes)
Add To Favourite