మెల్‌బోర్న్‌: నేటి నుంచి ఆస్ట్రేలియా ఓపెన్

స్విస్‌ స్టార్‌ రోజర్‌ ఫెదరర్‌, సెర్బియా స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌లు ఏడోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ కప్‌ గెలుచుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. నేడు ఈ టోర్నీ ప్రారంభం కానుంది. మరో దిగ్గజ ఆటగాడు, బ్రిటిన్‌కు చెందిన అండీ ముర్రే గాయంతో సతమవుతుండటంతో ఈ టోర్నీలో రాణించడం కష్టమే. గత ఏడాది ముర్రే, ఫెదరర్‌, జకోవిచ్‌, నాదల్‌లు బిగ్‌ ఫోర్‌గా బరి లోకి దిగారు. ఈ సారి ఆ పరిస్థితి ఉండటం లేదు. ప్రపంచ నెంబర్‌ 1 జకోవిచ్‌ నెంబర్‌ 3 ఫెదరర్‌లు ఈసారి శక్తివంతమైన యువ ఆటగాళ్లలో తలపడనున్నారు. జకోవిచ్‌ తన ప్రారంభ మ్యాచ్‌లో జర్మనీకి చెందిన అలెగ్జాండర్‌ జెవెరెవ్‌తో తలపడుతున్నాడు. జెవెరెవ్‌ కూడా తన కెరియర్‌ తొలి మేజర్‌ టైటిల్‌కోసం ఎదురుచూసు ్తన్నాడు. గాయంతో సతమతమవుతున్న ముర్రే గ్రాండ్‌ స్లామ్‌కు ముందే తన రిటైర్మెంట్‌ ప్రకటించి సంచలనం సృష్టించాడు. తొడ కండరం నొప్పితో ఈ ఏడాది వింబుల్డన్‌ తర్వాత రిటైర్‌ కానున్నట్లు తెలిపాడు. ముర్రే తన తొలి మ్యాచ్‌లో స్పెయిన్‌కు చెందిన రాబర్టో బాటిస్టా అగట్‌తో తలపడనున్నాడు. ఫెదరర్‌ తన ప్రారంభ మ్యాచ్‌లో డెనిస్‌ ఇస్టోమిన్‌తో నేడు తలపడనున్నాడు. బ్రిస్బేన్‌ వార్మప్‌లోనే విరమించిన వరల్డ్‌ నెంబర్‌ 2 ఆటగాడు ఆరుసార్లు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత స్పెయిన్‌కు చెందిన రఫెల్‌ నాదల్‌ పూర్తి ఫిట్‌నెస్‌ ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. తాను ఫిట్‌గా ఉన్నానంటూ అస్ట్రేలియన్‌ బరిలోకి వచ్చాడు. మరోవైపు సెర్బియాకు చెందిన 31 ఏళ్ల జకోవిచ్‌ కూడా ఆరుసార్లు ఆస్ట్రేలియా ఓపెన్‌గెలిచి ఏడో టైటిల్‌కోసం బరిలో ఉన్నాడు. 2018 ఆస్ట్రేలియన్‌ ఒపెన్‌ ప్రారంభానికి ముందే జకోవిచ్‌ మోచేయికి శస్త్ర చికిత్స చేయించుకుని బరిలోకి దిగి తొందరగానే ఇంటిదారి పట్టాడు. ఫలితంగా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్‌ 20 జాబితాలో తన స్థానాన్ని కోల్పో యాడు. అదే ఏడాది జూలైలో జరిగిన వింబుల్డన్‌ టైటిల్‌ సాధించి మళ్లి వరల్డ్‌ నెంబర్‌ వన్‌ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇది తన కెరియర్లో నాలుగో టైటిల్‌. అనంతరం ఆడిన మూడు టోర్నీల్లో ఓటమి చెందాడు. ఇందులో జెవెరెవ్‌తో ఆడిన ఏటీపీ ఫైన ల్‌ మ్యాచ్‌ కూడా ఉంది. సెప్టెంబర్‌లో తన మూడో యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ను గెలుచుకున్న జకోవిచ్‌ ఈ గెలుపుతో తన ఖాతాలో 14 గ్రాండ్‌ స్లామ్‌ టైటిళ్లను వేసుకున్నాడు. జకోవిచ్‌ టైటిళ్ల సంఖ్య, స్పెయిన్‌ స్టార్‌ రఫెల్‌ నాదల్‌ సాధించిన మొత్తం టైటిళ్ల కంటే మూడు తక్కువగా ఉండగా, ఫెరరర్‌ సాధించిన టైటిళ్ల కంటే ఆరు తక్కువగా ఉన్నాయి. ఆదివారం జకోవిచ్‌ మీడియాతో మాట్లాడుతూ.. మెల్‌బోర్న్‌ బరిలో తిరిగి పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉంది. 2008లో ఇక్కడ సాధించిన తొలి గ్రాండ్‌స్లామ్‌తో తన కెరియర్‌ మలుపు తిరి గిందన్నాడు. జకోవిచ్‌ తన ప్రారంభ పోటీని మంగ ళవారం అమెరికాకు చెందిన మిచెల్‌ క్రూగర్‌తో ఆడనున్నాడు.
టోర్నీ తొలిరోజు పోటీలోనే 37 ఏళ్ల ఫెదరర్‌ గట్టి ప్రత్యర్థిని ఎదుర్కోను న్నాడు. ఉజ్బెక్‌ టెన్నిస్‌ స్టార్‌ డెనిస్‌ ఇస్టోమిన్‌తో తలపడనున్నాడు. నేను మంచి టెన్నిస్‌ ఆడుతున్నాను. నన్ను ఓడించాలంటే నా ప్రత్యర్థి నాకంటే మంచి స్థాయిలో ఆడాల్సి ఉంటుంది. నా విజయంపై నాకు విశ్వాసముంది అని ఫెదరర్‌ తెలిపాడు. ఫెదరర్‌ ఇటీవల ఫెర్త్‌లో జరిగిన హోప్‌మన్‌ కప్‌లో విజేతగా నిలిచి ఆత్మ విశ్వాసంతో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ బరిలోకి దిగుతున్నాడు.
ఈ సారి ఆస్ట్రేలియా ఓపెన్లో యువ స్టార్‌ ఆటగాళ్లు జర్మనీకి చెందిన జెవెరెవ్‌, క్రొయే షియాకు చెందిన బోర్నా, రష్యాకు చెందిన కరెన్‌ ఖచనొవ్‌, గ్రీస్‌కు చెందిన స్టెఫానో టిసిట్స్‌పాస్‌ తమ ఆటతో సీనియర్లకు చెక్‌ చెప్పనున్నారు. హోప్‌మన్‌ కప్‌ మిక్స్‌డ్‌ టీంలో ఆటగాడిగా ఫైనల్‌కు చేరిన 21 ఏళ్ల జెవెరెవ్‌ తన పోరును  పూర్ణ విశ్వాసం తో ప్రారంభించనున్నాడు. మెల్‌బోర్న్‌లో ఇప్పటివరకు ఆడిన మ్యచుల్లో జెవెరెవ్‌ మూడో రౌండ్‌ కంటే దిగువన ఓడలేదు. గత ఏడాది నాలుగో సీడెడ్‌గా ఉన్న జెవెరెవ్‌ మంగళవారం తన ఓపెనింగ్‌ మ్యాచ్‌లో స్లొవేనియాకు చెందిన ఆల్‌జాజ్‌ బెడెనెతో మంగళవారం తలపడనున్నాడు. ఆస్ట్రేలియాలో అభిమానులు ఈసారి తమ దేశానికి చెంది న ఆటగాళ్లలో ఒకరు కొత్త చాంపియన్‌గా అవిర్భవించాలని కోరుకుంటున్నారు. ఆస్ట్రేలియా యువ ఆటగాడు 27వ సీడెడ్‌ అలెక్స్‌ డి మినౌర్‌ సోమవారం తన ప్రారంభ మ్యాచ్‌లో పోర్చుగల్‌కు చెందిన పెడ్రో సౌసాను ఢీకొనున్నాడు. ఆస్ట్రేలియాకే చె ందిన నిక్‌ కిర్గియోస్‌కు కఠిన ఓపెనింగ్‌ లభించింది. తన తొలి మ్యా చ్‌ ³లో వరల్డ్‌ నెంబర్‌ త్రీ ఆటగాడు మిలోస్‌ రానొక్‌తో అనంతరం రెండో రౌండ్లో మాజీ ఆస్ట్రేలియన్‌ చాంపియన్‌ స్టాన్‌ వావ్రింకాతో తలపడే అవకాశముంది.