ఏఎఫ్‌సీ ఆసియాకప్‌: గెలిస్తే నేరుగా నాకౌట్‌కు, భుటియా రికార్డు సమం

హైదరాబాద్: ఏఎఫ్‌సీ ఆసియాకప్‌లో భాగంగా బహ్రెయిన్ జట్టుతో కీలక పోరుకు సిద్ధమైంది. గ్రూప్‌ ‘ఎ’లో సోమవారం జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో బహ్రెయిన్‌తో భారత పుట్ బాల్ జట్టు తలపడుతుంది. 1964లో ఏఎఫ్‌సీ ఆసియాకప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత ఫుట్‌బాల్ జట్టు మళ్లీ ఇప్పటి వరకు కనీసం నాకౌట్ రౌండ్‌కు చేరలేకపోయింది.

బీబీఎల్: బిల్లీ స్టాన్‌లేక్ కామెడీ రనౌట్ వీడియోని చూశారా?

అయితే, స్టీఫెన్ కాన్‌స్టాంటైన్ అద్భుత శిక్షణలో రాటుదేలిన భారత ఫుట్‌బాల్ జట్టు ఈ మధ్య కాలంలో అద్భుత విజయాలను నమోదు చేస్తోంది. దీంతో ఈసారి నాకౌట్ రౌండ్‌కు చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని పుట్‌బాల్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు కెప్టెన్‌గా ఛెత్రికిది 107వ మ్యాచ్‌.

ఇప్పటివరకు ఛెత్రి 67 అంతర్జాతీయ గోల్స్ సాధించాడు. మాజీ కెప్టెన్ బైచుంగ్‌ భూటియా (107) రికార్డును సమం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. తొలి లీగ్ మ్యాచ్‌లో థాయిలాండ్‌తో 4-1 తేడాతో గెలిచి శుభారంభం చేసినా.. ఆతిథ్య యూఏఈ జట్టుపై 2-0తో ఓడిపోయింది. 3 పాయింట్లతో గ్రూప్‌లో రెండోస్థానంలో కొనసాగుతుంది.

ఈ మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా నాకౌట్ రౌండ్ చేరనుంది. ఒకవేళ ఓడినా భారత్‌కు నాకౌట్‌ అవకాశాలున్నాయి. మొత్తం ఆరు గ్రూప్‌ల నుంచి తొలిరెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా నాకౌట్ రౌండ్ చేరనుండగా.. మూడోస్థానంలో నిలిచే ఆరు జట్లు మిగిలిన నాలుగబెర్త్‌ల కోసం పోటీ పడనున్నాయి. గ్రూప్ స్టేజ్‌లో థాయిలాండ్‌ను ఓడించిన భారత్ బహ్రెయిన్ చేతిలో ఓడినా మూడోస్థానంతో నాకౌట్ రేసులో నిలువనుంది.

ఏడు సార్లు ముఖాముఖి పోరులో

మరోవైపు బహ్రెయిన్ జట్టు గెలిస్తేనే నాకౌట్ చేరే అవకాశం ఉంది. ఇప్పటివరకు బహ్రెయిన్‌తో ఏడు సార్లు ముఖాముఖిగా తలపడిన భారత్‌ కేవలం ఒక్కసారి (1979లో) మాత్రమే గెలిచింది. బహ్రెయిన్‌ ఐదింట నెగ్గగా, మరో మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిసింది.

సోమవారం, జనవరి 14

ఇండియా vs బహ్రెయిన్
షార్జా ఎరీనా (షార్జా)
మ్యాచ్ ప్రారంభం 9.30pm IST
లైవ్: Star Sports 2/HD
లైవ్ స్ట్రీమింగ్: Hotstar