విజయవాడ: పెదరావూరు బయల్దేరిన జనసేనాని పవన్‌ కల్యాణ్‌

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయవాడ నుంచి గుంటూరు జిల్లా పెదరావూరు బయల్దేరారు. పెదరావూరులో జరిగే సంక్రాంతి సంబరాల్లో పవన్‌ కల్యాణ్‌ పాల్గొననున్నారు. రైతులు, ఆడపడుచుల మధ్య పవన్‌ కల్యాణ్‌ సంక్రాంతి సంబురాలు జరుపుకోనున్నారు. భోగి మంటల కార్యక్రమంలో పాల్గొననున్నారు. జనసేనాని రాకతో ఒక రోజు ముందుగానే గ్రామస్థులకు సంక్రాంతి సంబురాలు మొదలయ్యాయి. పవన్‌ రాకతో తెనాలి అంగరంగ వైభవంగా ముస్తాబైంది. సాయంత్రం జాగోరే జాగో కార్యక్రమాన్ని పవన్‌ ప్రారంభించనున్నారు. డెల్టా ప్రాంత రైతులతో ఇష్టాగోష్టి నిర్వహించనున్నారు. అన్నదాతను ఆత్మీయంగా పలుకరించనున్నారు.