ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలుగు ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.  పేదల కళ్లలో వెలుగే నిజమైన సంక్రాంతి అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఏడాది పింఛన్ పెంపు పేదలకు పెద్ద కానుక అని తెలిపారు. జన్మభూమి కార్యక్రమంలో తెలుగుదేశం ప్రభుత్వ పనితీరుపై ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని పేర్కొన్నారు. పారదర్శకంగా, నిస్వార్థంగా పనిచేయడం వల్లే జన్మభూమి కార్యక్రమంలో గొడవ చేయాలని కొందరు యత్నించినా విఫలమయ్యారని వ్యాఖ్యానించారు.