గుంటూరు: భారీ ర్యాలీతో తెనాలి చేరుకున్న పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలికి చేరుకున్నారు. పెదరావురు వ్యవసాయ క్షేత్రంలో సంక్రాంతి సంబరాలలో పాల్గొనేందుకు తెనాలి చేరుకున్న మరికాసేపటిలో పెదరావురు చేరుకోనున్నారు. గుంటూరు నుండి జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీగా పవన్ వెంట వచ్చారు. పవన్ తో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్, జనసేన నేత నాదెళ్ల మనోహర్ కూడా ర్యాలీలో పాల్గొన్నారు.