యూ ముంబాకు అగ్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Published Sunday, 9 December 2018

విశాఖపట్నం (స్పోర్ట్స్), డిసెంబర్ 8: ప్రొ కబడ్డీ సీజన్ సిక్స్‌లో యూ ముంబా జట్టు మరో విజయాన్ని తన ఖాతాలో జమ చేసుకుంది. దీంతో పూల్-ఏ లో యూ ముంబా జట్టు అగ్రస్థానం దక్కించుకుంది. ఇక్కడి స్పోర్ట్స్ రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో యూ ముంబా జట్టు 31-20 పాయింట్లతో బెంగాల్ వారియర్స్ జట్టును ఓడించింది. మ్యాచ్ ప్రారంభంలో బెంగాల్ వారియర్స్ జట్టు 5-2 పాయింట్లతో ఆధిక్యత సాధించినా ఆ తర్వాత యూ ముంబా జట్టు దూకుడుకు తల వంచింది. ముంబా స్టార్ రైడర్ సిద్ధార్ధ్ దేశాయ్ రైడింగ్‌లో రాణించి ప్రతి రైడ్‌లో రెండేసి పాయింట్లు సాధించడంతో విరామ సమయానికి 15- 9 పాయింట్లతో ఆధిక్యత సాధించింది. ఆ తర్వాత రెండు నిముషాలకే బెంగాల్ జట్టును ఆల్ ఆవుట్ చేయడంతో ముంబా జట్టు 20-10 పాయింట్లతో ముందంజలోకి వచ్చింది. ద్వితీయార్థంలో ముంబా జట్టు అదే రీతి ఆటను కొనసాగించింది. డిఫెన్స్‌లో సురేంద్రసింగ్, కేరలాధన్, రైడింగ్‌లో దర్శన్ కూడా రాణించడంతో ముంబా జట్టు 11 పాయింట్లు ఆధిక్యతతో విజ యం సాధించింది. ఈ మ్యాచ్‌లో సిద్దార్థదేశాయ్‌ను సబ్సిట్యూట్ చేయడంతో సూపరడన్ సాధించలేకపోయాడు. బెంగాల్ వారియర్స్ జ ట్టులో మణిందర్ సింగ్ ఏడు పాయింట్లు సాధించినప్పటికీ కీలక సమయంలో రెండు సార్లు సూ పర్ టాకిల్‌కు గురికావడంతో మ్యాచ్ చేజారింది.
టైటాన్స్ గెలుపు బాట: వరుసగా అయిదు ఓటముల అనంతరం తెలుగు టైటాన్స్ జట్టు శనివారం మ్యాచ్‌లో ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. శుక్రవారం రాత్రి జరిగిన తొలిమ్యాచ్‌లో గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్ చేతిలో ఓడిపోయిన టైటాన్స్ శనివారం నాటి రెండో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్‌ను 36-26 పాయింట్లతో చిత్తు చేసి మళ్లీ ఫాంలోకి వచ్చింది. శనివారం జరిగిన మ్యాచ్‌లకు టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ స్టార్ అట్రాక్షన్‌గా నిలిచాడు. మ్యాచ్‌లు ప్రారంభానికి ముందు ధావన్ ప్రేక్షకులకు కనిపించడంతో సందడిగా మారింది.

చిత్రం..ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో తలపడుతున్న యూ ముంబా, బెంగాల్ వారియర్స్ జట్ల ఆటగాళ్లు


Back to Top