అడిలైడ్ టెస్ట్: ధోని రికార్డును బద్దలు కొట్టిన రిషబ్ పంత్

నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో రిషబ్ ఆరుగురిని అవుట్ చేయడంలో భాగస్వామి అయ్యాడు. ఇన్నింగ్స్ మొత్తంలో పంత్ ఆరు క్యాచ్‌లు అందుకున్నాడు. దీంతో ఆసీస్‌పై ఈ ఘనత సాధించిన తొలి భారత వికెట్ కీపర్‌గా చరిత్ర సృష్టించాడు.

1

43623

అంతకముందు ఈ రికార్డు మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉండేది. ధోని రెండు సార్లు ఐదుగురిని అవుట్ చేయడంలో భాగస్వామి అయ్యాడు. అయితే, ఇప్పుడు పంత్ ఆరుగురిని ఔట్ చేయడం ద్వారా ధోని రికార్డుని అధిగమించాడు. ఈ క్రమంలో భారత్ తరపున ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక ఓట్‌(6)లలో భాగస్వామి అయిన కీపర్ల సరనస పంత్ నిలిచాడు.

రిషబ్ పంత్ కంటే ముందు ఈ జాబితాలో సయ్యద్ కిర్మాణీ 6(5 క్యాచ్‌లు, ఒక స్టంప్), ధోని 6, సాహా 6(5 క్యాచ్‌లు, ఒక స్టంప్)లు ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ టెస్టు సిరిస్‌లో ధోని వారసుడిగా రిషబ్ పంత్ రాణిస్తున్నాడు. అటు కీపర్‌గానే కాకుండా బ్యాటింగ్‌లో సైతం రాణిస్తున్నాడు.

టెస్టు క్రికెట్‌కు ధోని వీడ్కోలు పలికిన తర్వాత అతడి స్థానంలో వృద్ధిమాన్ సాహా రెగ్యులర్ వికెట్ కీపర్‌గా కొనసాగుతున్నాడు. అయితే, వృద్ధిమాన్ సాహాకు గాయం కావడంతో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో జట్టులో చోటు దక్కించుకున్నాడు.

రిషబ్ పంత్

అడిలైడ్ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో రిషబ్ పంత్ ఉస్మాన్ ఖవాజా, పీటర్ హ్యాండ్స్ కోంబ్, ట్రావిస్ హెడ్, జోస్ హెజెల్‌ఉడ్, టిమ్ పైన్, మిచెల్ స్టార్క్‌లను పెవిలియన్ కు చేర్చడంలో భాగస్వామి అయ్యాడు. ఈ ఏడాది నాటింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో సైతం పంత్ ఒక ఇన్నింగ్స్‌లో ఐదు క్యాచ్‌లు అందుకున్న సంగతి తెలిసిందే. టీమిండియా మాజీ వికెట్ కీపర్ మోంగియా ఒక ఇన్నింగ్స్‌లో రెండు సార్లు (1996లో డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో.. 1999లో కోల్ కతా వేదికగా పాక్ తో జరిగిన మ్యాచ్‌లో) ఐదు క్యాచ్‌లు అందుకున్నాడు.

ధోని

వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మొట్టమొదటిసారి ధోని ఈ ఘనత సాధించాడు. ఒక ఇన్నింగ్స్‌లో ఐదు క్యాచ్‌లను ధోని మూడు సార్లు అందుకున్నాడు. 2008లో పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో, 2011లో కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో, 2011లో ముంబై వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని ఈ ఘనత సాధించాడు.

సయ్యద్ కిర్మాణి

భారత్ తరుపున ఒక ఇన్నింగ్స్‌లో ఆరుగురిని పెవిలియన్‌కు చేర్చిన మొట్టమొదటి వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణి. అయితే సయ్యద్ కిర్మాణీ ఖాతాలో 6(5 క్యాచ్‌లు, ఒక స్టంప్) ఉండటం విశేషం. క్రైస్ట్ చర్చ్ వేదికగా 1976లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సయ్యద్ కిర్మాణి ఈ రికార్డు నమోదు చేశాడు.

వృద్ధిమాన్ సాహా

సయ్యద్ కిర్మాణి లాగే వృద్ధిమాన్ సాహా 6(5 క్యాచ్‌లు, ఒక స్టంప్) కూడా ఈ రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. 2016లో ఆంటిగ్వా వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన టెస్టులో సాహా ఈ ఘనత సాధించాడు. ఇక, ఒక ఇన్నింగ్స్‌లో ఐదు క్యాచ్‌లను సాహా రెండు సార్లు అందుకోవడం విశేషం. దీంతోపాటు ఒక మ్యాచ్‌లో 10 క్యాచ్‌లను అందుకున్న ఏకైక భారత వికెట్ కీపర్ సాహానే.