రెండో వికెట్ కోల్పోయిన భారత్

అడిలైడ్: నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా అడిలైడ్ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. కొద్దిరోజులుగా ఫామ్ లేమితో బాధపడుతున్న ఓపెనర్ రాహుల్ ఈ మ్యాచ్‌లో పర్వాలేదనిపించాడు. 67 బంతులను ఎదుర్కొన్న అతడు మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 44 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న రాహుల్‌ను హజెల్‌వుడ్ పెవిలియన్‌కు చేర్చాడు. మరో ఎండ్‌లో వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ పుజారా ఆచితూచి ఆడుతున్నాడు. అంతకు ముందు మరో ఓపెనర్ విజయ్ 11 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్‌లో అవుటైన విషయ తెలిసిందే. ప్రస్తుతం భారత్ 26 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. కోహ్లీ 1, పుజారా 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ కంటే భారత్ 98 పరుగుల ఆధిక్యంలో ఉంది.