భారత్-ఆసీస్ టెస్టు.. నిలిచిపోయిన ఆట

అడిలైడ్: నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా అడిలైడ్ ఓవల్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగించాడు. ఓవర్‌నైట్ స్కోరు 191/7తో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఆసీస్‌.. ఆరంభంలోనే మరో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన స్టార్క్‌ను బూమ్రా అవుట్ చేశాడు. అదే సమయంలో వర్షం పడడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపేశారు. ప్రస్తుతం ఆసీస్ 91.4 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. హెడ్ 66 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోరుకు ఆస్ట్రేలియా 46 పరుగులు వెనుకబడి ఉంది.