తొలి టెస్టులో చెత్త రికార్డును బద్దలుగొట్టిన ఆటగాడు


first test match between india and australia
first test match between india and australia

అడిలైడ్‌ : ఆస్ట్రేలాయా కు భరత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆసీస్ ఆటగాడు షాన్ మార్ష్ అనుకోని చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఏకంగా 130 ఏళ్ల తర్వాత ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. అశ్విన్ బౌలింగ్‌లో మార్ష్ (2) బౌల్డయ్యాడు. అశ్విన్ వేసిన బంతిని మార్ష్ ఆడేందుకు ప్రయత్నించగా అది బ్యాట్‌ను తాకి వికెట్లను గిరాటేసింది. దీంతో మార్ష్ రెండు పరుగులకే మార్ష్ పెవిలియన్ చేరాడు. మార్ష్ ఇలా సింగిల్ డిజిట్‌కే అవుటవడం ఇది వరుసగా ఆరసారి. ఆసీస్ టాప్5 ఆటగాళ్లలో ఎవరూ ఇలా ఆరుసార్లు సింగిల్ డిజిట్‌‌కే పెవిలియన్ చేరలేదు. 1888 తర్వాత ఇలా ఆరుసార్లు సింగిల్ డిజిట్‌కే అవుటడం ఇదే తొలిసారి. కాగా, షాన్ మార్ష్ ఇటీవల పేలవ ఫామ్‌తో ఇబ్బందులు పడుతూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. గత 13 టెస్టుల్లో అతడు చేసిన పరుగులు 40కి మించలేదంటే అతడి ఆటతీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.