గడ్డం తీసేసే సమయం వచ్చింది

uttam kumar reddy comments on results

తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని, ప్రజాకూటమి 70 – 80 స్థానాల్లో కచ్చితంగా విజయం సాధిస్తుందని, 12మా తమ ప్రభుత్వం ఏర్పాటుకాబోతుందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ప్రజాకూటమి నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రజాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని, తాను గడ్డం తీసేసే సమయం వచ్చేసిందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించిన ఇండియా టుడే జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ తనకు ఫోన్ చేసి… తాము ఎగ్జిట్ పోల్స్ లో చెప్పినట్లుగా ఫలితాలు ఉండవని, రాష్ట్రంలో పోటాపోటీగా ఫలితాలు ఉండవచ్చని చెప్పినట్లు తెలిపారు. టీడీపీతో పొత్తు గ్రేటర్ పరిధిలో కలిసివచ్చిందని పేర్కొన్నారు.