ఉదయ్‌పూర్‌లో ఈషా అంబానీ పెళ్లి వేడుకలు: హాజరైన అతిరథమహారథులు..

ఉదయ్‌పూర్‌లో ఈషా అంబానీ పెళ్లి వేడుకలు: హాజరైన అతిరథమహారథులు..

ఈషా పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు ఉదయ్‌పూర్ వచ్చిన హిల్లరీ క్లింటన్‌తో ముఖేష్ అంబానీ, నీతా అంబానీ
Updated: December 8, 2018, 7:12 PM IST

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న ఈషా అంబానీ పెళ్లి వేడుకలకు దేశ, విదేశీ ప్రముఖులు హాజరువుతున్నారు. ఈనెల 12న ముంబైలో ముఖేష్, నీతా అంబానీల కుమార్తె ఈషా అంబానీ, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ పిరమాల్‌ వివాహం ఈనెల 12న ముంబైలో జరగనుంది. దానికి సంబంధించి ఈనెల 7 నుంచి ఉదయ్‌పూర్‌లో వివాహవేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు హాజరవుతున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా రంగాల్లో అతిరథమహారథులు అందరూ వేడుకలకు తరలివస్తున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ మీద పోటీ చేసిన హిల్లరీ క్లింటన్ .. ఈషా అంబానీ పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు ఉదయ్‌పూర్ చేరుకున్నారు. భారతీయ సంప్రదాయ వస్త్రధారణను ప్రతిబింబించేలా ఆమె చుడీదార్‌లో వచ్చారు. వ్యాపార సామ్రాజ్యానికి చెందిన ప్రముఖులు కూడా పెళ్లి వేడుకలకు తరలివచ్చారు. మిట్టల్ ఇండస్ట్రీస్ అధినేత లక్ష్మి మిట్టల్, ఉషా మిట్టల్, ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ విశాల్ శిక్కా, నోకియా నుంచి రాజీవ్ సూరీ, హఫింగ్టన్ పోస్ట్ నుంచి అరియానా, టీవీ హోస్ట్ ఫరీద్ జకారియా తదితరులు హాజరయ్యారు.

ఈషా అంబానీ పెళ్లి వేడుకులకు హాజరైన అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్, ఆరాధ్య బచ్చన్

ఈషా అంబానీ పెళ్లి వేడుకులకు హాజరైన అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్, ఆరాధ్య బచ్చన్

ఈషా అంబానీ పెళ్లి వేడుకలకు సినీ ప్రముఖులు కూడా ఉదయ్‌పూర్ తరలివచ్చారు. అనిల్ కపూర్, డేవిడ్ ధావన్, విద్యాబాలన్, సిద్ధార్థరాయ్ కపూర్, జాన్ అబ్రహాం – ప్రియా రాంచల్, జావేద్ జాఫ్రీ, సచిన్ టెండుల్కర్ – అంజలీ టెండుల్కర్, కొత్త జంట ప్రియాంకా చోప్రా – నిక్ జోనస్, సాక్షి సింగ్ ధోనీ, ధోనీ కుమార్తె జీవా కూడా ఉదయ్‌పూర్‌కు తరలివచ్చారు.

ఈషా అంబానీ పెళ్లి వేడుకలకు హాజరయ్యేందుకు ఉదయ్‌పూర్ వచ్చిన హిల్లరీ క్లింటన్

ఉదయ్‌పూర్‌లో తమ కుమార్తె పెళ్లి జరుగుతున్న ఆనందంలో ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు డిసెంబర్ 7 నుంచి 10వ తేదీ వరకు అన్నదానం చేస్తున్నారు. రోజుకు 5100 మందికి ఈ నాలుగు రోజుల పాటు, రోజుకు మూడు పూటలా విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ ‘అన్న సేవ’లో ముఖేష్, నీతా అంబానీ దంపతులు, అజయ్, స్వాతి పిరమాల్ దంపతులతో పాటు, కాబోయే వధూవరులు ఈషా అంబానీ, ఆనంద్ పిరమాల్ కూడా పాల్గొన్నారు. అతిథులకు స్వయంగా వడ్డించారు.

Loading….

ఇవి కూడా చదవండి
Video:ఈషా అంబానీ పెళ్లి వేడుకకు హాజరైన ప్రముఖులుFirst published: December 8, 2018