ఇషా-ఆనంద్ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్..తరలివచ్చిన అతిథులు

ఉదయ్‌పూర్‌: ప్రముఖ ఫార్మా ఇండస్ట్రియలిస్ట్‌ అజయ్‌ పిరమల్‌ కుమారుడు ఆనంద్‌ పిరమల్‌తో ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వివాహం ఈనెల 12న జరగనుంది. డిసెంబరు 8, 9తేదీల్లో ఇషా- ఆనంద్ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. రాజ‌స్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇషా, ఆనంద్‌ల ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు వ్యాపార‌, క్రీడా రంగాల ప్ర‌ముఖుల‌తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. శుక్ర‌వారం నుంచే ఇరు కుటుంబాల్లో పెళ్లి సంద‌డి నెల‌కొంది. రెండు సార్లు అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన బిల్ క్లింటన్ సతీమణి హిల్ల‌రీ క్లింట‌న్ కూడా ఉదయ్‌పూర్‌ చేరుకున్నారు. ఆమెకు కూడా ప్రీవెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్‌లో పాల్గొన‌నున్నారు. బాలీవుడ్ తార‌లు విద్యాబాల‌న్‌, సిద్ధార్థ్ రాయ్ క‌పూర్‌, జాన్ అబ్ర‌హం, ప్రియా రంచ‌ల్‌, మాజీ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌, అంజ‌నీ టెండూల్క‌ర్‌, ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్‌, సాక్షి సింగ్ ధోనీ త‌దిత‌రులు వేడుక‌ల్లో పాల్గొనేందుకు త‌ర‌లివస్తున్నారు. అతిథులు దిగే హోటళ్ల వద్ద భద్రతకు భారీగా పోలీసులను నియమించారు.imageimage