అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ : వైఎస్‌ జగన్‌

Submitted by chandram
on Sat, 12/08/2018 – 18:33

నిరుద్యోగ యువతే లక్ష్యంగా వైయస్ జగన్‌మోహన్ రెడ్డి హామీల వర్షం కురిపించారు. 2019లో వైఎస్సార్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే మోగా డీఎస్సీ వేస్తామని ఏపీ. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 316వ రోజు శనివారం శ్రీకాకుళం పట్టణం ఏడు రోడ్ల కూడలిలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు లక్షల ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్‌ ప్రకటిస్తామని అలాగే ప్రతి ఏటా ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని భరోసా ఇచ్చారు.ప్రతి ఊరులో గ్రామ సచివాలయం ఏర్పాటుచేసి అదేగ్రామానికి చెందిన 10 మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

Share icon