అడిలైడ్ టెస్టు, డే 2: టీ విరామానికి ఆస్ట్రేలియా 117/4

దీంతో రెండో రోజు టీ విరామానికి నాలుగు వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది. శుక్రవారం ఆటలో భాగంగా తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆస్ట్రేలియా ఇషాంత్‌ శర్మ వేసిన తొలి ఓవర్‌లోనే ఆరోన్ ఫించ్‌ వికెట్‌ను చేజార్చుకుంది. తొలి ఓవర్‌ మూడో బంతికి ఫించ్‌ బౌల్డ్‌ కావడంతో ఆసీస్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది.

రెండో వికెట్‌గా హారిస్‌

అనంతరం క్రీజులోకి వచ్చిన మార్కస్‌ హారిస్‌-ఉస్మాన్‌ ఖవాజాల జోడి స్కోరు బోర్డుని నడిపిస్తున్నారు. వీరిద్దరూ కలిసి 45 పరుగులు జోడించిన తర్వాత హారిస్‌(26) రెండో వికెట్‌గా అశ్విన్‌ బౌలింగ్‌లో మురళీ విజయ్‌కు క్యాచ్‌ ఇచ్చి హారిస్‌ పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత స్పల్ప వ్యవధిలోనే షాన్‌ మార్ష్‌(2)ని అశ్విన్‌ పెవిలియన్‌కు చేర్చడంతో ఆస్ట్రేలియా 59 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.

87 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయిన ఆసీస్

ఆ తర్వాత మరో 28 పరుగుల వ్యవధిలోనే ఉస్మాన్ ఖవాజా(28) కూడా అశ్విన్‌ బౌలింగ్‌లో ఔట్‌ కావడంతో ఆస్ట్రేలియా 87 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి దిగిన పీటర్ హ్యాండ్‌స్కాంబ్‌-ట్రావిస్‌ హెడ్‌ల జోడీ నిలకడగా ఆడటంతో తిరిగి ఆస్ట్రేలియా గాడిలో పడింది. కాగా, తొలి ఇ‍న్నింగ్స్‌లో టీమిండియా 250 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

ఓవర్‌నైట్ స్కోరు 250/9 పరుగులతో

ఓవర్‌నైట్ స్కోరు 250/9 పరుగులతో రెండోరోజైన శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమిండియా పరుగులేమీ చేయకుండానే మహ్మద్‌ షమీ(6) రూపంలో చివరి వికెట్‌ను కోల్పోయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో హెజెల్‌ఉడ్‌కు మూడు వికెట్లు తీయగా… స్టార్క్, కుమ్మిన్స్, నాథన్ లియాన్ తలో రెండు వికెట్లు తీశారు.