రవితేజ.. ట్రబుల్ షూటర్: శ్రీనువైట్ల

director srinu vaitla speech at amar akbar anthony pre release event

రవితేజ.. ట్రబుల్ షూటర్: శ్రీనువైట్ల
మాస్ మహారాజా రవితేజ తనకు ఎప్పుడూ ట్రబుల్ షూటర్ అని టాలీవుడ్ దర్శకుడు శ్రీనువైట్ల చెప్పారు. తాను ఎప్పుడైనా డల్‌గా కనిపిస్తే రవితేజ ఎనర్జీని ఇస్తాడని కొనియాడారు. ‘అమర్ అక్బర్ ఆంటొని’మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం రాత్రి హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ఆ మూవీ దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు. దాంతో తొలుత సినిమాకు పనిచేసిన అందరికీ పేరు పేరునా థ్యాంక్స్ చెప్పిన శ్రీనువైట్ల.. హీరోయిన్ ఇలియానాను ప్రస్తావించడాన్ని మరిచిపోయారు. ఎమోషన్‌ కావడంతో అలా జరిగిందని ఆయ చెపుకొచ్చారు.

‘రవితేజ నాకు ఎప్పుడూ ఎనర్జీని ఇస్తాడు. అతడు నాకు మంచి ట్రబుల్ షూటర్. నిరుత్సాహంతో ఉన్న సందర్భాల్లో చేయూతనిస్తాడు. వెంకీ గానీ, దుబాయ్ శీను మూవీ అయినా అలాంటి సందర్భాల్లో తీసినవే. ప్రస్తుతం అమర్ అక్బర్ ఆంటొని చేశాడు. నాకు మరో అవకాశం ఇచ్చిన రవితేజకి ధన్యవాదాలు’ అని రవితేజతో తన అనుబంధాన్ని, తనకిచ్చే మద్దతును ఈ సందర్భంగా శ్రీనువైట్ల గుర్తుచేసుకున్నారు.

Director Srinu Vaitla
Loading
అరెరె.. ఇలాయానాను మరిచిపోయిన శ్రీనువైట్ల

ఏదైనా మూవీని రెండు సీజన్లు అమెరికాలో చేయడమంటే మామూలు విషయం కాదని, కానీ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల సహకారంతో ఏ ఇబ్బంద లేకుంగా షూటింగ్ పూర్తి చేశామన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సాంగ్స్‌తో పాటు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఇచ్చారని చెప్పారు. వంశీ, ప్రవీణ్ వర్మ, ప్రవీణ్‌లు కథ విషయంలో చాలా సహకరించారని, మూవీకి పనిచేసిన టెక్నీషియన్లు అందరికీ ధన్యవాదాలు తెలిపిన శ్రీనువైట్ల.. ఇలియానా గురించి ప్రస్తావించడం మరిచిపోయారు.

మైక్ తిరిగిచ్చే సమయంలో ఇలియానాను చూసి పరిస్థితి అర్థం చేసుకుని ఆమె గురించి మాట్లాడారు. ‘ఎప్పటినుంచో ఆమెతో సినిమా చేయాలనుకున్నా. అమర్ అక్బర్ ఆంటొనితో అది సాధ్యమైంది. పనిపట్ల నిబద్ధత ఉన్న నటి ఇలియానా. ఆమె మరిన్ని సినిమాలు చేయాలి. ఈ మూవీకి కష్టపడి డబ్బింగ్ కూడా చెప్పారని’డైరెక్టర్ వివరించారు.