ఢిల్లీలో ఇప్పటికీ జటిలంగానే వాయు కాలుష్యం

               న్యూఢిల్లీ : దేేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోతోంది. కేంద్ర కాలుష్య నివారణ మండలి నివేదికల ప్రకారం వాయు నాణ్యత సూచిక(ఎక్యూఐ) 396 వద్ద నమోదైంది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. సిరి పోర్ట్‌, శ్రీనివాసపురి, మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ నేషనల్‌ స్టేడియం, ప్రతాప్‌ గంజ్‌లో వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం గాలి నాణ్యత సూచిక 423 వద్ద నమోదైంది. కాగా, ఎస్‌ఎఎఫ్‌ఎఆర్‌ నివేదికల ప్రకారం పిఎం 2.5 వద్ద 303 నమోదు కాగా, పిఎం 10 వద్ద 440 నమోదైందని, ఇది అత్యంత ప్రమాదకరమని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు హెచ్చరించారు.

Tags:

పెళ్లి సంబంధం కోసం వెతుకుతున్నారా?… అందుకు సరైన వేదిక‘ప్రజాశక్తి పెళ్లిపుస్తకం’. వెంటనే రిజిస్టర్ చేసుకోండి – రిజిస్ట్రేషన్ ఉచితం