గాంధీ భవన్‌కు మరింత భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Published Sunday, 11 November 2018

హైదరాబాద్, నవంబర్ 10: టిక్కెట్టు దక్కదని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు రోజూ పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్‌లో ఆందోళనలకు దిగుతున్నారు.
దీంతో తమ పార్టీ కార్యాలయానికి మరింత భద్రత పెంచాల్సిందిగా పార్టీ శనివారం పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా ఇకమీదట రాత్రి 8 గంటల తర్వాత ప్రధాన గేటు మూసేయాలని, ఎవరినీ అనుమతించరాదని నిర్ణయం తీసుకున్నారు. టిక్కెట్ దక్కదని భావిస్తున్న నేతలు నాలుగు రోజులుగా గాంధీ భవన్ ఆవరణలోని ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. శేరిలింగంపల్లి, మల్కాజిగిరి, ఖానాపూర్ తదితర నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారు. ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయని ముందుగానే ఊహించిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ముందు జాగ్రత్తగా ప్రైవేటు సెక్యురిటీని ఏర్పాటు చేశారు. రెండు పూటలా షిప్టుల్లో 50 మందిని నియమించారు.

చిత్రం.. శనివారం గాంధీ భవన్ వద్ద ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు


Back to Top