ఐఈఎస్ లో నిట్‌ విద్యార్థికి ఫస్ట్‌ ర్యాంక్‌

కాజీపేట, నవంబరు 10: దేశవ్యాప్తంగా నిర్వహించిన ఇండియన్‌ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ (ఐఈఎస్‌) పరీక్షలో వరంగల్‌ నిట్‌ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ) విద్యార్థులు సత్తా చాటారు. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన అమన్‌ జైన్‌ ఆలిండియా స్థాయిలో ప్రథమ ర్యాంక్‌ సాధించాడు. ఎలక్ర్టికల్‌లో బీటెక్‌ పూర్తి చేసిన అంకిత్‌ 36వ ర్యాంకు, ఈసీఈ విభాగానికి చెందిన ప్రభాత్‌ పాండే 46వ ర్యాంకు సాధించారని నిట్‌ డైరెక్టర్‌ ఎన్‌.వి.రమణారావు శనివారం తెలిపారు. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడంపై హర్షం వ్యక్తంచేశారు.