ఢిల్లీ: కాందహార్ విమానానికి హైజాక్ టెన్షన్

hijack scare on kandahar-bound plane at delhi airport,  pilot says mistake

పైలెట్ నోట్
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కాందహార్ విమానానికి హైజాక్ టెన్షన్ వెంటాడింది. శనివారం మధ్యాహ్నం రన్ వేపై టేకాఫ్‌కు సిద్ధంగా విమానంలో ఉన్నట్టుండి హైజాక్ అలారం మోగింది. నిమిషాల వ్యవధిలోనే ఎన్‌ఎస్‌జీ సహా భద్రతా బలగాలు కూడా ఫ్లైట్‌ను చుట్టుముట్టడంతో.. ప్రయాణికులు భయంతో వణికిపోయారు. కొద్దిసేపటి తర్వాత హైజాక్ జరగలేదని తెలిసి.. హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు.

ఎయిర్ పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ నుంచి FG-312 విమానం టేకాఫ్‌కు సిద్ధమయ్యింది. ఆ సమయంలో 124మంది ప్రయాణికులు, సిబ్బంది సహా 133మంది ఉన్నారు. రన్ వే పై నుంచి మరికొద్ది సేపట్లో విమానం గాల్లోకి ఎగురుతుందనగా.. ఉన్నట్టుండి అలజడి రేగింది. అలారం వినబడటంతో ప్రయాణికులంతా ప్రాణ భయంతో వణికిపోతూ.. గట్టిగా కేకలు వేశారు.

విమానంలో నుంచి అలారం మోగగానే.. ఎయిర్ పోర్టులో ఉన్న భద్రతా బలగాలన్నీ పరుగున రన్ వేపైకి వచ్చేశాయి. వెంటనే ఫ్లైట్‌ను చుట్టుముట్టాయి. కొద్దిసేపు ఏం జరుగుతుందో కూడా అర్థంకాని పరిస్థితి. తర్వాత విమానంలోకి అడుగు పెట్టిన భద్రతా సిబ్బంది ఏం జరిగిందని ఆరా తీస్తే.. పైలెట్ పొరపాటున హైజాక్ అలారం బటన్ నొక్కాడని తేలింది. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో విమానం రెండు గంటల ఆలస్యమయ్యింది.

image

పైలెట్ నోట్

మొత్తానికి పైలెట్ చేసిన పొరపాటుతో ప్రయాణికులంతా ప్రాణ భయంతో వణికిపోగా.. ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ ఘటనపై ఆఫ్ఘన్ ఎయిర్‌లైన్స్ కూడా ఆరా తీసింది. అలాగే పైలెట్ కూడా దీనిపై ఓ నోట్ కూడా రాశారు.

Read This Story In English

+